శ్రీ సాయిబాబా కాకడ హారతి(Shri Saibaba Kakada Haarathi)
-
శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
కరములు మోడ్చి నీ సన్నిథిలో సాయి గురుదేవ విన్నపాలె వినుపింతుమయ పండరినాథ
తెలియగ లేని భక్తి ప్రపత్తుల తెలియగ జేసి కరుణను యేలి కృపతోచూడుము సద్గురు రాయ
అనంతమగు నీ సేవ చేయగ ఆర్తిగ వేడితిమి ఆపద్భాందవ అల్పులమయ్య అవలోకించకయ
భక్త తుకారామ్ వేడిన వేదన వింటివిగా స్వామి మన్నన చేసి మా బంధములను త్రెంచుము దేవ
లెమ్ము పాండురంగ ప్రభాత సమయమ్మాయెగా వైష్ణవ భక్తులు వరుసలు తీరి ముందుగ నిలిచారు
సురవర గణమె నిలిచె మహాద్వార పర్యంతమ్ గరుడ స్తంభం నుండె కొలిచేరు ఆద్యంతమ్
నారద తుంబుర శుకశనకాదులు వేచిరి నీకోసమ్ మధుర గానముల మేలుకొలుప కాచిరి నీకోసమ్
భక్తశ్రేష్ఠుడు నామదేవుడు అరుదెంచెను పాడ సేవించగ నీ పదముల వ్రాల జనాభా ఇదేచే
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ
మోహాంబుధిలో తిరిగే జీవుల దారిచూపు చరణమ్ పాపనివారణ పరిహారమ్ముకు పరమపదమె చరణమ్
ఎన్ని జన్మల పుణ్యఫలము నీ పదములంటు తరుణమ్ కూడదయ్య ఇక జన్మమాకిల నీదు చరణుశరణమ్
ఓం సాయినాధ మహరాజ భవతినిరనాశకరవి అజ్ఞానాంధకారమణచి వెలుగు నింపుమాహరి నీదుమహిమ వర్ణింపమాతరమా దేవదేవ మరి
ఉనికిని తెలిపె మహిమాన్వితమె నీదు చరణ కమలమ్ భవతాపములను హరియించె అ పదమె మాకు శరణమ్
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ
భక్తిగనిలిచిరి నీముంగిటయే భక్తకోటి అంత జ్ఞానయోగుని దర్శనమ్ముకై సర్వప్రాణియంత
దివ్యధాముని కరుణరాముని కనగ వేచిరంత దర్శనమ్ముతో పరవశించగా సకల భువనమంత
వరమై వెలసినావె దీనబంధు రమాకాంత పాహి పాహి పరంధామ పాహిమామ్ పండరీశ
మధురనామ కలియుగేశ పాహిమామ్ సాయినాథ
జయతు జయతు చిద్విలాస జయతు సాయిరామ
బ్రహ్మ పాదమె ముక్తిమార్గమె నీదుపాదయుగళమ్
లెమ్ము లెమ్ము శ్రీ సాయనాథ నీ చరణమంటనిమ్మ భవతాపములను హరియించె ఆ పదములంటనిమ్మ
లెమ్ము పాండురంగ లెమ్ము దర్శనమౌ ఫలమిమ్ము
అరుణమ్మాయె ఆకాశమె నిదురలేచి రమ్ము
సాధు పుంగవులు మునివరేణ్యులె వేచి నిలిచినారు
శయన సుఃఖమునె వదలి చూపుమా శుభకరవదనమునే
రంగ మండపమ్ మహాద్వారమున ఎదురుతెన్నులె చూసి
నిన్ను గాంచగా మా మది ఊగె దర్శనమీయవయ
అమ్మా రుక్మిణి కనవమ్మా నీ ప్రేమమీదుగా మమ్ము
విఠలరూపుని దర్శనమొసగె భాగ్యమ్మును ఇమ్ము
గరుఢ్మంతుడు ఆంజనేయుడె ఎదురులు చూసేరు
సురలోకపు ఘణదేవులంత కొలువై వేచారు
హారతిలివ్వగ భక్తిగ నిలిచె సర్వలోకమంత
కాకడ హారతి పాడగ వేచిరి విష్ణుదాసునామా
పంచహారతుల హారతులివ్వరె ఘనముగ సాయికి
రండి రండి జయ సాయికి సేయ కాకడ హారతి
స్థిలచిత్తములతొ ధ్యానము చేసె వైభవ హారతి
కృష్ణనాథునకు దత్తసాయికి మనసుల హారతి
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కామక్రోధమదమత్సరంబులె వత్తిగ మలచితిమి
వైరాగ్యమనె నేతిని తడిపి శుధ్ధిగ చేసితిమి
సాయిభక్తినే జ్వాలగ చేసి వెలిగించగ చూడ
సాయిసద్గురుని విశ్వరూపమె సాక్షాత్కరించె కనుల
తత్త్వసారమె వేదరూపమె సాయిసర్వరూపమ్
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
భూమ్యాకాశము వ్యాపించితివో హృదయకమలవాస
దత్తరూపమై వెలుగుచుంటివో షిరిడీ పురవాస
నీవే దైవము నీవే సర్వము నీవే జీవమయ
ఆపదలందె దయమున కాచి అక్కునచేర్తువయ
ఎన్నగ తరమా వేల్పులకైన నీ లీలల మహిమ
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
నీ యశ కీర్తులు దుండుగులై మామోగెను విశ్వమున
పావన చరితుని పరంథామగన షిరిడి చేరె జనులె
నీ వచనామృత సారముసోకి దేహభ్రాంతి వీడె
వదలె మనసున దురభిమానమె పదములంటె నేడె
కృపను జూపి కరుణించరావయ దాసులమేమయ్య
చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
కాకడ హారతి గైకొనుమయ్య సాయినాథ దేవ చిన్మయరూప చేకొనుమయ్య నీదు జనుల సేవ
భక్తిభావపు జ్యోతియె ఈ కాకడ జ్యోతి
పంచప్రాణములు నిండియున్న జీవమీజ్యోతి
చేకొనుమయ్య ఈ హారతి పండరినాథ సాయిసద్గురునాథ
కరములు చాచి శరణంటిమయ నీపదపద్మముల
నీదు మహిమలు వర్ణింపగ లేరంతవారైన
నిను దర్శించగ తొలగునయ ఏ పాతకమైన
రాయిరఘుమ వాయి చేరి ఇరువంకల నిలిచి
మయూరపించపు చామరములతో వీచుటకై నిలిచె
తుకారాముడె దీపముపట్టి ప్రణమిల్లుతుపాడె
పాండురంగడు విఠలేశ్వరుడు శోభిల్లగ నిలిచె
రండి సాధుభక్తులారా పుణ్యమౌరండి ప్రాణమునిలిచిన కొలువగలేము ఆ పరమాత్ముడనే
ఇటుకపైన నిలిచేను దేవుడె దర్శింతము రండి విఠలదేవుని పాదకమలము ప్రార్ధించగ రండి
చేరగరండి దేవళమందున సాయిని చూడగనే
సర్వపాపములు పరిహరించు ఆ కాకడ హారతిలో
రుక్మిణి ప్రియునకు నివేదించగ వెన్నలు ఇచ్చెదము
ఆలసించిన దోషము కలుగును స్వామి నివేదనకు
మ్రోగుచుండెగ ద్వారమందున భజంత్రీల హోరు
పంచప్రాణముల కాకడ హారతి ప్రజ్వరిల్లె చూడు
శంఖనాదముల సింహభేరులె దిక్కులెల్లమ్రోగ
వందనమ్మయ వందనమిదిగో పాండురంగనీకు
సాయినాథగురు తల్లివినీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
దత్తరాజగురు దైవమునీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
సాయినాథగురు సర్వమునీవె దత్తరాజగురు సద్గురునీవె ఆశ్రయమీయవె తండ్రివినీవై
శ్రీసత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
ప్రభాతమాయె శుభమ్ముగ రవి ప్రభాకరుదయించె
స్మరించి గురువుని పదమ్ములంటిన కలిదరిరాదాయె
జోడించి కరధ్వజమ్ము భక్తిగ సలుపగురు ప్రార్ధన
సమర్ధసద్గురువా సాయినాథుడె మనోవాంఛతీర్చు
చీకటిబాపును భానుడె గురువుబాపు అజ్ఞానమె
కాని గురవుకి సాటిరాడుగ సూర్యదేవుడెపుడు
చీకటి మరల వచ్చును తిరిగిగాదు అజ్ఞానము
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
రవి అరుదెంచిన పటాపంచలౌ అంధకారమం
గురుకృపతాకిన దుష్కృత్యములె అంతరించునంత
వదలిపోవుగా పాదమంటగ దురితమ్ములె అంత
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
త్రిమూర్తి రూపమె సాయినాథునిగ అవతరించె భువిలో
జీవులనిలలో ఉధ్ధరించగ తలచె సాయి మదిలో
అనంతమయమౌ మహిమరూపమె సాయి సద్గురుండు
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
సమాథినొదిలి మసీదు చేర రమ్ము సాయినాథ
మథురవచనముల ఊరడించ మము తిరిగి సాయినాథ
ఆఖిల పాపముల బాపగనిలిచె నిఖిల జనావనుడె
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
ఆహా ఎంతటి భాగ్యము కనులె తెరచె స్వామి
ఆశ్రితవదనుడె తానై ఆపదలను తీర్చగ
ఇంతటి ఉపకారి ఈ జగతిన వేరే లేరుగ
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
ఎంతటి జ్ఞానైన గురుదేవుల కృపయేలేకున్న
వ్యర్ధము సుమ్మా జీవించగ ఈ ధరిలో బ్రతికున్న
గురుపదచరణమ్మె భవ శరణం తిరుగేలేదన్న
సమర్ధగురువా సాయినాథుడె మనోవాంచతీర్చు
హృదయమందున నిలిచియుండుమా స్వామిసాయినాథ
సమస్తజగమె గురుస్వరూపమని తెలియచూపరాద
సద్గుణమ్ముతో సాగిపోవు సద్బుధ్ధిని మాకిమ్మ
సమర్ధసద్గురుసాయినాథ నిను చేరుదారినిమ్మ
ప్రభాత సమయంలో ఎవరయితే భక్తిశ్రధ్ధలతో ఈ అష్టకాన్ని పఠించెదరో వారి భ్రమలు తొలగి మహత్తరమయిన మనశ్శాంతి పొంది సాయి కృపాకటాక్షవీక్షణాలు కలిగి సుఃఖజీవనులగుదురు